సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ..
– తెలంగాణ ఉద్యమం ఊసు ఎత్తితేనే పొన్నాల లక్ష్మయ్య కేసులు పెట్టించారు, చేర్యాల ప్రాంత టీఆరెస్ కార్యకర్తలు ఆదర్శనీయం..
– 2001 లోనే ఎక్కువ ఎంపిటిసి, జడ్పిటిసి సీట్లు గెలుచుకున్న ప్రాంతం చేర్యాల.
– నీళ్లు,విద్యుత్ బాధను కేసీఆర్ తీర్చిండు..! అప్పట్లో ట్రాన్స్ఫార్మర్,మోటార్లు కాలేవి, ఇప్పుడా బాధే లేదు.
– ఎరువుల,విత్తనాల,కరెంట్ కొరత లేకుండా చేసిన ఘనత కేసీఆర్ ది.
– రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం, అపార భగీరథుడు కేసీఆర్.
– కాంగ్రెసోళ్ల ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తే రైతు బంధు పథకం చెక్కులు ఆగినవి..
– నెల రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడతాయి.
– నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడటం మొదలయ్యాయి.
– బిజెపి ప్రభుత్వం రైతులను ఆగం చేస్తుంది..
కంది పంటను 12 వందల కోట్లు పెట్టి పంటను కొనుగోలు చేసినం ప్రతి పంటకు మద్దతు ధర కలిపించాం.
– రైతులకు 5 లక్షల భీమా సౌకర్యం కలిపించాం ..రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.
– కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటే..తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తగ్గాయి.
– తెలంగాణ లో రైతులు ఒక భరోసాతో పంటను సాగు చేసుకుంటున్నారు.
– తెలంగాణలో కుట్రలు చేయడానికే పొత్తులు
క్రిష్ణ, గోదావరి జలాల నీళ్లను మలుపుకోవడానికే పొత్తుల పేరుతో కుట్రలు.
– కాళేశ్వరం ప్రాజెక్టు అపుదామని కేంద్రానికి
చంద్రబాబు లేఖ వ్రాశాడు..
అలా చేస్తే పోలవరం కు నీళ్లు వెళ్లి ఆంధ్రోల్లే బతుకుతారు..!?
– తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోవడంపై రాహుల్ గాంధీ నోరు మేధపలి.
రాహుల్ గాంధీ తెలంగాణ పై మొసలి కన్నీరు కారుస్తుండు.
పరిశ్రమల్లో ఆంధ్రకు ఎలా రాయితీ ఇచ్చావో, తెలంగాణ కు కూడా ఇవ్వాలి.
-తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చెయ్యడానికె కాళేశ్వరం ప్రాజెక్ట్.
– టీఆరె ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలగా కపడుకుంటాం.
– సెంట్రల్ వాటర్ కమీషన్ వల్లే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పగా ఉందని మెచ్చుకొని పోయారు..
– కాళేశ్వరం ప్రాజెక్టు పై బిజెపి పార్టీ వాళ్ళు తప్పుడు మాటలు ఆపండి.
– చేర్యాల సమగ్ర అభివృద్ధి టి ఆర్ ఎస్ సర్కారు తోనే అన్నారు.