సిద్ధిపేటలో అర్ధరాత్రి జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ ని ఆక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించడాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలతో కలిసి ఇంట్లోకి చొరబదెందుకు ప్రయత్నం చేసి, వృద్ధురాలైన తల్లి, వారి కుటుంబాన్ని, పిల్లలను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. సిద్ధిపేటలో రౌడీయిజానికి, గుండాయిజానికి చోటు లేదని, కానీ కాంగ్రెస్ నాయకులు, పోలీసులు ఈ కొత్త సంస్కృతిని ప్రోత్సహించడం అత్యంత బాధాకరమన్నారు, సిద్ధిపేట అంటేనే శాంతికి, ప్రేమకు చిహ్నంగా ఉన్న నేల అని, కాంగ్రెస్ గుండాలు హింసను ప్రేరేపించడం సరికాదన్నారు. శ్రీనివాస్ రెడ్డికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇలాంటి అక్రమ చర్యలకు మరోసారి పాల్పడితే, ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు..