రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ జల కవితోత్సవం పుస్తకావిష్కరణలో భాగంగా హరీష్ రావు పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ,
– మహబూబ్ నగర్ లో కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం, కరవు ప్రాంతం అయిన పాలమూరు కృష్ణ నీటితో సస్యశ్యామలం అవుతుంది.
– కళ్ళు ఉండి అభివృద్ధి ని చూడలేని వారిని ఏమనాలి.
– తెలంగాణ ఎక్కవ నీటిని వాడుకుంటుందని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశాడు.
– రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే మాకు ముఖ్యం.
– ఏ ఉద్దేశ్యంతో అయితే తెలంగాణ సాదించమో అది నెరవేరుతున్న అనుభూతి కలుగుతుంది.
– నేతలు గెలవకపోయిన ప్రజలకు మేలు చేయాలి.
– ఒక ఎకరానికి నీరు అందని వనపర్తి లో 65 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నాం.
– ప్రత్యర్థి పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు.
-నీటి కేటాయింపుకోసం బ్రజిస్ ట్రైబినల్ ముందు కొట్లాడుతున్నాం అన్నారు.