జీవి తరంగాలు

పండుకోసినంత సులభంగా శరీరాలు
కత్తులు  తెగ నరుకుతున్న బతుకులు
కసాయితనం కిరాయి గూట్లో గద్ద
కారణం ఏదైతేనేం గొడ్డలి నూరే పగలు
ఆయుధం ఏదైతేనేం చావు పండుగ నృత్యం
రక్షణ బజారుకెక్కి కొడిగట్టిన దీపం
సుడిగాలిలా తిరిగే హింసత్వం
నగరాల నడిబొడ్డున సంచారం
నిఘా కెమెరాలు,నిలువెత్హు టోపీలు
కోర్ట్ గుమ్మంలో వేలాడే తలలు

ప్రేమలు పండాల్సిన ఇంటి చేలలో
నెత్తురు దోసిట పట్టే సాయుధ పూలు
స్వేచ్ఛలేని జనన మరణాల తలరాతలు
జీవనసూచికలు రక్తపు మడుగులో
నేర ప్రవృత్తి ఎగిసిన పులి పంజా
కట్టడి చట్టం దీన యాచకత్వం

జీవి తరంగాలలో
రక్తపు బొట్టు గురిగింజంతే
భయం ఫోర్ డి సినిమాల నలువైపులా చలనం
నేరమంటే వణకాల్సిన సంకెళ్ళ చేతలు
విచ్చల విడి జన విహారం
భయం మర్రిమాను జనంలో విస్తరించడం విషాదం
తొలగించకపోతే మూలాలు జాతి జీవనానికి కడగళ్లు

–కొమురవెల్లి అంజయ్య —

error: