టమాటల కోసం లొల్లి , దేశం అతలాకుతలం

నైజీరియా : బంగారం కోసమో, వజ్రాల కోసమో కొట్లాడి దెబ్బలుతిన్నా, చచ్చినా బాగుంటుంది. కానీ, గంపెడు టమాట కోసం దేశం రెండు గ్రూపులుగా విడిపోయి చంపుకునేంత దాకా పోయారంటే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. కేవలం గంపెడు టమాటల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతున్నది. ఈ ఘర్షణల్లో ఇప్పటిదాకా 20 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆఫ్రీకా దేశమైన నైజీరియాలో టమాట బుట్ట కారణంగా ఘర్షణలు చెలరేగాయి. దేశం ఉత్తరం, దక్షణం అని రెండుగా విడిపోయింది. ఘర్షణల్లో ఇప్పటివరకు 20 మంది మరణించారు. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగి టమాటలు రోడ్డుపై పడి అంతటా వ్యాపించాయి. ఇది సమీపంలోని దుకాణదారులు, పోర్టర్‌లతో వాదనకు దారితీసింది. ఆ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసి పోరాటంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దేశం ఉత్తర ముస్లింలు-దక్షిణాది క్రైస్తవులు విడిపోయింది. ఈ ఉద్రిక్తత సంఘటన జరిగిన 4 గంటల తర్వాత హింసాత్మక రూపాన్ని సంతరించుకున్నది. అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. వేలాది మంది ఇండ్లను వదిలి పారిపోయారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌లో మాంసం అందుబాటులో లేకుండా పోయింది. టమాటలతోపాటు మిగతా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఘర్షణలను నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రజలు ఇండ్లు విడిచి బయటకురాకుండా కఠిన ఆంక్షలు విధించారు

error: