టీడీపీతో కాంగ్రెస్‌ దోస్తీ?

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు పొత్తులపైన దృష్టి సారిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమువుతుంటే మరి కొందరు పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. జాతీయ రాజకీయాల పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాలలో మాత్రం పొత్తులపై రోజుకో కొత్త ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో పొత్తులతో వేళ్లే పార్టీ ఏదీ? ఒంటరిగా వెళ్లేది ఎవరనేది ఆస్తకికరమైన చర్చ జరగుతుంది.

ముందస్తు ఎన్నికలంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి.  పొత్తులుంటాయని రాహుల్ తేల్చేయడంతో అది టీడీపీతోనేనని రాష్ట్ర నేతలు అన్వయించుకుంటున్నారు. ఏపి వరకూ టీడీపీ వ్యూహంపై స్పష్టత రాకపోయినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ కలిసి అడుగేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కాంగ్రెస్‌తో జత కలిసి ఇటు తెలంగాణలో పోటీకి దిగాలన్నది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పొత్తు కుదిరితే అటు ఏపీలోనూ కొనసాగుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రానున్న సార్వత్రిక ఎన్నికలో టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి వస్తుందని సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ బహిరంగంగానే తన వ్యాఖ్యలతో కలకలం సృష్టిం చిన సంగతి తెలిసిందే. టీకాంగ్రెస్, టీడీపీ  మధ్య మాత్రం దీనిపై రహస్య మంతనాలు సాగుతున్నాయని వార్తలొస్తున్నాయి.

error: