డాక్టర్ తో భార్య ఎఫ్ఫైర్, భర్త హత్య

తాగుబోతు భర్త ప్రవర్తనతో ఎదిగిన పిల్లలకు పెళ్లిళ్లు అవ్వట్లేదని అలవాటు మాన్పించేందుకు డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది భార్య…అదే సమయంలో ఆ భార్య డాక్టర్ తో ఎఫ్ఫైర్ పెట్టుకుంది. ప్రియుడితో కలిసి తాగుబోతు భర్తను అమానుషంగా అంతమొందించింది.ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఘట్కేసర్ లో చోటుచేసుకుంది.

ఎన్ఎఫ్సి నగర్ కి చెందిన టైలర్ అంజయ్య (57), భవాని దంపతులకు ఇద్దరు కొడుకులు.పెద్ద కొడుకు పక్క రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండగా,చిన్న కొడుకు స్థానికంగా ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.మద్యానికి బానిసైన అంజయ్య నిత్యం తగొచ్చి భార్య, చిన్న కొడుకుని వేధింపులకు గురిచేసేవాడు.భర్త ప్రవర్తన కారణంగా పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు అని వైద్యుడు సతీష్ దగ్గరికి తీసుకెళ్లగా ఆ పరిచయం ఇద్దరికి వివాహేతర సంబందంగా మారింది.సెప్టెంబర్ 29 న అంజయ్య మద్యం మత్తులో భార్యఙ్ తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆగ్రహంతో ప్రియుడితో కలిసి భర్తను చంపేయ్యాలని నిర్ణయించుకుంది.మరుసటి రోజు సతీష్ ఇచ్చిన నిద్రమాత్రలు భర్తతో మింగించింది.మత్తులోకి జారుకున్నాక సతీష్ కుమార్ తో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నం చేసింది.వెంటనే తేరుకున్న అంజయ్య ఇంట్లో నుండి పారిపోయేందుకు ప్రయత్నిచడంతో రొకలిబండతో కిరాతకంగా చంపేసింది…వాహనం ఢీకొని చనిపోయాడని అందరిని నమ్మించింది… పోలీస్ ల ఎంట్రీ తో అసలు కథ బయటపడింది…ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు…

error: