డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఎంపిక జాబితా విడుదల

తెలంగాణ గురుకులాల్లోని డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఎంపిక జాబితాను తమ వెబ్సైటులో పొందుపరిచినట్లు TSPSC తెలిపింది.వివరాలకు వెబ్సైటు ను సందర్శించాలని కోరింది.
ఆబ్కారీ కానిస్టేబుల్ కొలువులకు 22 మంది ఎంపిక
ఆబ్కారీ కానిస్టేబుళ్ల కొలువుల భర్తీలో భాగంగా 22 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు TSPSC తెలిపింది.అర్హులైన అభ్యర్థులు దొరకక మరో రెండు ఖాళీలు భర్తీ చేయలేదని పేర్కొంది.
పలు పోస్టుల అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్
పురపాలక శాఖలోని శానిటరీ ఇన్స్పెక్టర్,హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు చేసిన అభ్యర్థుల వివరాల్లో పలు పొరపాట్లు దొర్లినందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించామని tspsc తెలిపింది.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 26 వ తేదీ నుండి 28 వరకు వాటిని సవరించుకోవాలి సూచించింది.
ట్యూటర్ పోస్టరులకు నాలుగో విడుత ధ్రువపత్రాల పరిశీలన
డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లోని ట్యూటర్ పోస్టులకు ఈ నెల 30 ,డిసెంబర్ 1 ,3 వ తేదీల్లో నాలుగోవిడుత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు tspsc తెలిపింది.
FAO అభ్యర్థులకు 29 న ధ్రువపత్రాల పరిశీలన
రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల అభ్యర్థులకు రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 29 న నిర్వహించనున్నట్లు శనివారం tspsc తెలిపింది.తమ కార్యాలయంలో నిర్వహించే ఈ ప్రక్రియకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్సైట్ లో పెట్టనున్నట్లు పేర్కొంది.నిర్దేశిత మార్గదర్శకాలను అనుసరించి అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
గురుకులాల పీడీ పోస్టుల పరీక్షా ఫలితాలు విడుదల
తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు tspsc తెలిపింది.ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైటులో పెట్టినట్లు పేర్కొంది.

error: