డెన్మార్క్ ఓపెన్ బ్యాట్మింటన్ మేన్స్ సింగిల్స్ లో భారత్ తరుపున ఆడిన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఓడిపోయాడు.సెమిస్ లో జపాన్ షట్లర్ మోమోట చేతిలో 21 -16 ,21 -12 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి,టోర్నీ నుండి నిష్క్రమించాడు.క్వార్టర్స్ ఫైనల్స్ వరకు అద్భుతంగా ఆడిన శ్రీకాంత్,సెమిస్ లో గత ఆట తీరును ఏ దశలోనూ ప్రదర్శించలేకపోయారు.