తల్లితో రిలేషన్, కూతురిమీద కన్ను

సంచలనం సృష్టించిన గొర్రెకుంటలో 9 మంది హత్యల కేసును చేధించామని, సీసీ కెమెరాలో కీలకంగా నిలవడంతో 72 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందని వరంగల్ సీపీ రవీందర్ వెల్లడించారు. హత్యలు చేసిన ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను 2020, మే 25వ తేదీ సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా..హత్య ఎలా చేశాడు ? ఎందుకు చేశాడు ? తదితర వివరాలను ఆయన వెల్లడించారు. విచారకరమైన ఘటనగా వెల్లడించారు. గౌడోన్ ఓనర్ కంప్లయింట్ మీద..కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

6 బృందాలు దర్యాప్తు : –
2020, మే 21వ తేదీన..బావిలో నుంచి 4 శవాలు తీయడం జరిగిందని, అందులో మక్సూద్, ఆయన భార్య, కూతురు, మనవడి డెడ్ బాడీస్ ఉన్నాయన్నారు.
మరుసటి రోజు అంటే 22వ తేదీ ..బావిలో ఉన్న నీటిని తోడిన తర్వాత..మరలా 5 మృతదేహాలు లభ్యమయ్యామన్నారు. 9 మంది హత్య చేసిన వారెవరో తెలుసుకొనేందుకు 6 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హత్య ? ఆత్మహత్య ? ఇలాంటి ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యామన్నారు.

సంజయ్ కుమార్ : –
ఆరేళ్ల క్రితం సంజయ్ కుమార్ ఉపాధి కోసం వరంగల్ కు వచ్చాడని, శాంతినగర్ లో ఉన్న గోనె సంచుల తయారీ కేంద్రంలో పనిచేశాడన్నారు. పనిచేస్తున్న సమయంలోనే మక్సూద్ కుటుంబంతో సంజయ్ కు పరిచయం ఏర్పడిందన్నారు. మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫికా వెస్ట్ బెంగాల్ నుంచి ముగ్గురు పిల్లలను తీసుకుని వరంగల్ కు వచ్చిందన్నారు. ఆమె కూడా మక్సూద్ సహాయంతో గోనె సంచుల తయారీ పరిశ్రమలో పని చేసిందన్నారు. సంజయ్ వద్ద డబ్బులు తీసుకుని..భోజనం పెట్టేదన్నారు. వీరిద్దరి పరిచయం..సానిహిత్యానికి దారి తీసిందిన్నారు.

కూతురుతో చనువు..రఫికాను చంపేశాడు : –
ఒక రూం తీసుకుని నాలుగేళ్లుగా సహజీవనం సాగించారని ఈ క్రమంలో…రఫికాకు యుక్త వయస్సు వచ్చిన కూతురు ఉంది. ఈమెతో చనువుగా ఉండడంపై సంజయ్ ను రఫికా హెచ్చరించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి..కుమార్తెతో చనువుగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫికా బెదిరించింది. దీంతో రఫికాను అడ్డు తొలగించుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. తమ పెళ్లి విషయం బంధువులతో మాట్లాడుదామని చెప్పి…రఫికాను తీసుకుని 2020, మార్చి 06వ తేదీన గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లారని వెల్లడించారు. ప్రీ ప్లాన్ ప్రకారం..మజ్జిగ ప్యాకెట్లలో నిద్ర మాత్రలు వేసి ఇవ్వడంతో రఫీకా సృహ కోల్పోయిందని, అనంతరం చున్నీతో ఉరి వేసి..ట్రైన్ నుంచి కిందకు తోశాడన్నారు.

నిలదీసిన మక్సూద్ భార్య :-
అక్కడి నుంచి ఇతర ప్రాంతాల గుండా..వరంగల్ కు చేరుకున్నాడన్నారు. రఫికాను పశ్చిమ బెంగాల్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లినట్లు సంజయ్ నమ్మించాడన్నారు. కొద్ది రోజుల అనంతరం రఫికా ఎక్కడుందని మక్సూద్ భార్య నిషా గట్టిగా ప్రశ్నించినట్లు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సంజయ్ ను హెచ్చరించిందన్నారు. దీంతో నిషా కుటుంబంపై కోపం పెంచుకున్నాడని, దీంతో మక్సూద్ ఆళం, నిషా ఆలంలను హత్య చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడన్నారు.

ఆహారంలో నిద్రమాత్రలు :-
2020, మే 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోదాం దగ్గరకు రోజు వెళ్లి వచ్చి రెక్కీ చేశాడన్నారు. 20వ తేదీ మక్సూద్ పెద్ద కొడుకు షాబాజ్ ఆలం పుట్టిన రోజని తెలియడంతో ఆ రోజే ప్లాన్ అమలు చేయాలని డిసైడ్ అయ్యాడన్నారు. వరంగల్ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపు నుంచి 60 నిద్రమాత్రలు తీసుకొని వచ్చి…అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో గోదాంకు వచ్చాడన్నారు. మృతులకు తెలియకుండా…వారి ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడన్నారు. ఇక్కడ బీహారీ యువకులు శ్రీరాం, శ్యాంలు తినే ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాడన్నారు.

9 మందిని బావిలో పడేశాడు :-
అదే రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలోపు సృహలో లేని 9 మందిని గోనె సంచిలో పెట్టి ఒక్కొక్కరిని బావిలో పడేశాడన్నారు. మృతుల గదుల్లో నుంచి కిరాణా సామానులతో పాటు…వారి సెల్ ఫోన్లు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడన్నారు. రఫికా పిల్లలను షెల్టర్ హోంకు తరలించామన్నారు. గోదాం, గొర్రెకుంటలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు.

error: