తియ్యని బ్రెడ్‌ ఆమ్లెట్‌

కావాల్సిన పదార్థాలు:

కోడి గుడ్లు – రెండు,

బ్రెడ్‌ ముక్కలు – ఐదు

చెక్కర – 50గ్రాములు,

సోడా – చిటికెడు,

నూనె – తగినంత.

తయారుచేసే విధానం:
ఒక్కో బ్రెడ్‌ని నాలుగు ముక్కలుగా కట్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి, అందులో చెక్కర వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా సోడా వేసి స్పూనుతో బాగా కలపాలి.  కడాయి లో నునే పోసి. కట్‌ చేసిన బ్రెడ్‌ ముక్కల్ని కోడు గుడ్డు మిశ్రమంలో వేసి వేయించాలి. రెండు పక్కలా ఎరుపు రంగు వచ్చే వరకూ కాల్చాలి. అంతే బ్రెడ్‌ ఆమ్లెట్‌ రెడీ.

error: