తెరాస అభ్యర్థులకు మరోసారి పట్టం కట్టండి-ఎంపీ అసదుద్దీన్

కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలు పొత్తుపెట్టుకుని కూటమి పేరుతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి రావడాన్ని ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు.ఇది కూటమి కాదు,2018 ఈస్ట్ ఇండియా కంపెనీ.తెలంగాణను దోచుకుంటారు తరిమికొట్టండి అని పిలుపునిచ్చారు.తెరాస అభ్యర్థులకు మద్దతుగా సంగారెడ్డి తో పాటు పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ,విజయవాడలో ఉంది తెలంగాణను శాసించాలనుకునే చంద్రబాబును,నాగపూరులోని RSS కనుసన్నల్లో నడిపించాలనుకుంటున్న బీజేపీ ని,ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రాన్ని పాలించాలనుకునే కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలి అని అన్నారు.

error: