తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా

తెలంగాణలో 111 కొత్త కేసులు

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా వైరస్ సోకింది.దీంతో ఆమె హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆమె విస్తృతంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.19,929 పరీక్షలు నిర్వహించగా కొత్త కేసులు అవి బయటపడ్డాయి.తాజా కేసులతో ఇ్పపటి వరకు తెలంగాణలో 3 లక్షల 11 కేసులు బయటపడ్డాయి.

                                      ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.కరోనా వ్యాధితో ఆదివారం ఒకరు మరణించారు.దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 1642కు చేరింది.కరోనా బారి నుంచి ఆదివారం 189 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,96,562కు చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం 1807 యాక్టివ్ కేసులున్నాయిా. వారిలో 689 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 27 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయింది.తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 89,84,552కు చేరుకుంది.

error: