త్వరలోనే భారతీయ అధికారిక డిజిటల్‌ కరెన్సీ

న్యూఢిల్లీ : త్వరలోనే భారతీయ అధికారిక డిజిటల్‌ కరెన్సీ రాబోతున్నది. దేశంలోని అన్ని ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌ సెషన్‌లోనే పార్లమెంట్‌లోకి డిజిటల్‌ రూపాయికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ‘క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు 2021’ పేరుతో చట్టాన్ని మోదీ సర్కారు తీసుకువచ్చే వీలుందని సమాచారం. ఇందులో జాతీయ అధికారిక డిజిటల్‌ కరెన్సీ సృష్టి కోసం విధివిధానాలు, మార్గదర్శకాలు ఉండనున్నాయి. ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ డిజిటల్‌ రూపీని జారీ చేస్తుంది. పొరుగు దేశం చైనా సైతం గత ఐదేండ్ల నుంచి డిజిటల్‌ యువాన్‌ను ఆవిష్కరించే పనిలో ఉండటం గమనార్హం.

error: