దీక్ష దివస్ కి నేటితో 13 ఏండ్లు

తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏండ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగారు.ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును టీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది. 2009 నవంబర్‌ 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్‌ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్‌ బయలుదేరగా, కరీంనగర్‌ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తరువాత నిమ్స్‌ దవాఖానకు తరలించారు. అక్కడే కేసీఆర్‌ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. తెలంగాణ  ఏర్పాటు చేస్తామని డిసెంబర్‌ 9న యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే ఆయన దీక్షను విరమించారు.

error: