కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8,9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు.ఈ మేరకు ఆర్టీసీ ఎక్స్క్యూటివ్ డైరెక్టర్ కు సమ్మె నోటీసులిచ్చారు.పెట్రోల్,డీజిల్ ను GST లోకి తీసుకురావాలని,రవాణా రంగ కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలుగా అమలు చేయాలనీ కోరారు.అటు కేంద్ర ప్రభుత్వం సవరణ చేసిన మోటార్ వాహన చట్టం కార్మికులను అణచివేసేలా ఉందన్నారు.
