తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెరాస నేత,చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఖండించారు.అవన్నీ వట్టి ప్రచారాలే అన్న ఆమె,తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదన్నారు.తనకు కెసిఆర్ న్యాయం చేస్తారని చెప్పిన ఆమె,వచ్చే ఎన్నికల్లో చొప్పదండి టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
