నోబెల్ శాంతి బహుమతికి మోదీ పేరు

చూస్తుంటే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రధాని మోదీకి అంతర్జతీయ ఖ్యాతిని తెచ్చిపెడుతున్నట్టుగానే వుంది.  ప్రపంచంలోనేఅతిపెద్ద హెల్త్ కేర్ పథకమైన  ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని మోదీ ఆదివారం ప్రారంభించడం తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల కోసం, వారి ఆరోగ్య భద్రతకై రూపొందించిన ఈ పథకాన్ని హర్షిస్తూ… ఇంత చేసిన ప్రధానికి గౌరవ పురస్కారం రాకపోతే ఎలా అని భావించారు తమిళనాడు బీజేపీ పార్టీ నాయకులు.

అనుకున్నదే తడవుగా మోదీ పేరును నోబెల్ శాంతి పురస్కారం కోసం నామినేట్ చేశారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్తమిళసై  సౌందర రాజన్ మీడియాకు తెలిపారు. నరేంద్ర మోదీక నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకోవడానికి పూర్తి అర్హుడని వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేటు యూనివర్సిటీలో నెఫ్రాలజీ విభాగం హెడ్‌గా, సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న తన భర్త డాక్టర్ పి. సౌందరరాజన్ కూడా మోదీకి నోబెల్ పురస్కారం రావాల్సిందేేనని పట్టుబట్టారని ఆమె చెప్పుకొచ్చారు జనవరి 31 నుంచి 2019 నోబెల్ శాంతి బహుమతి నామినేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు.  ప్రతియేటా సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియప్రారంభమవుతుంది. యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, పార్లమెంటు సభ్యులు సహా ఇతరులు కూడా మోడీని నామినేట్చేయవచ్చని తమిళనాడు బీజేపీ స్పష్టం చేసింది.

error: