పనీర్ తో మంచి పులావ్

కావాల్సిన పదార్థాలు:

పనీర్ ముక్కలు – 1కప్పు
వండిన అన్నం – 4 కప్పులు
క్యాప్సికమ్ ముక్కలు – 1కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1/2కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టి స్పూను
అజినో మోటో – చిటికెడు
వెన్న – 2 స్పూన్లు
వెన్న – తగినంత
ఉప్పు – తగినంత

తయారు చేసే పద్దతి :
కడాయిలో వెన్న, నూనె వేసి అందులో పనీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, అజినోమోటో వేసి వేపాక, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించాలి. కాస్త ఉప్పు వేస్తే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని కూడా చేర్చి బాగా కలపాలి. వండిన అన్నాన్ని, సరిపడా ఉప్పుని
కడాయిలో వేసి కలపాలి. అంతే మీరు ట్రై చేయాల్సిన  పనీర్ రైన్ తినడానికి రెడీ.

error: