పన్నీర్ గులాబ్ జామ్

కావలసినవి:
పచ్చికోవా-ఒకటిన్నర కప్పు
పన్నీర్ తురుము -ఒకటిన్నర కప్పులు
మైదా పిండి-5 టేబుల్ స్పూన్స్
రవ్వ-5 టేబుల్ స్పూన్స్
బేకింగ్ పౌడర్-అర టీ స్పూన్,నెయ్యి,నూనె వేయించుకోవడానికి సరిపడా,
పంచదార-1 కప్పు
నీళ్లు-అర కప్పు
ఏలకులు-2

తయారీ విధానం :ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పచ్చికోవాను ఒక పాన్ లో రెండు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.ఒక బౌల్ తీస్కొని దానిలో పన్నీర్ తురుము,పచ్చికోవా,మైదా పిండి,రవ్వ,బేకింగ్ పౌడర్ వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు చపాతీ పిండిలా కలుపుకోవాలి.పంచదార,నీళ్లు ఒక పాన్ లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి.పంచదార కరిగిన వెంటనే ఏలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నెయ్యిలో వేయించుకుని పంచదార పాకంలో వేసుకుని ఒక గంట తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

error: