పవన్ అభిమాని ఆత్మహత్య

విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్ కుమార్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. తల్‌వాకర్స్ జిమ్‌లో అనిల్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నారు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు పవన్‌కు అనిల్ లేఖ రాశారు. తను మృతదేహాన్ని చూసేందుకు రావాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తన అంతిమ క్రియలు పవన్ చేతుల మీదుగా జరగాలని, పవన్ తప్పకుండా వస్తారన్న నమ్మకం తనకు ఉందని తన సూసైడ్ లేఖలో అనిల్ పేర్కొన్నారు.

error: