పారిశ్రామికాభివృద్ధికి చర్యలు భేష్

తెలంగాణాలో పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న చర్యలు బాగున్నాయని త్రిపుర సీఎంఓ అదనపు కార్యదర్శి డాక్టర్ మిలింద్ రామ్ కోటికి కొనియాడారు వీటి గురించి అధ్యయనం చేసేందుకు త్వరలో తమ ఉన్నతస్థాయి అధికారుల బృందం తెలంగాణాలో పర్యటిస్తుందని తెలిపారు. మిలింద్ నేతృత్వంలో త్రిపుర అధికారుల బృందం సోమవారం టీఎస్ఐఐసిని సందర్శించింది ఈ సందర్బంగా రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల గురించి టీఎస్ఐఐసి సీఈవో మధుసూదన్ వారికీ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామల స్థాపనకు టీఎస్ఐపపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చే విధానం చాలా బాగున్నదని త్రిపుర బృందం ప్రశంసించారు బృందంలో అగర్తలా మున్సిపల్ ఆడిషన్ కమిషనర్ మయూర్ గోవెంకర్, ఐటీశాఖ డైరెక్టర్ దాస్ ఈ గవర్నెన్స్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ పార్థముఖర్జీ ఉన్నారు.

error: