పీవీ ఎక్స్ప్రెస్ హైవే కి పగుళ్లు

అది దేశంలోనే అతి పొడవైన ఫ్లై ఓవర్.. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన రహదారి.. మొత్తం 11.633 కిలోమీటర్ల దూరం.. కానీ, ఇప్పుడు పగుళ్లతో ప్రమాదకరంగా మారింది. మెట్రో స్టేషన్‌ పెచ్చులు ఊడి ఓ యువతి మీద పడడంతో ఆమె మృతి చెందిన ఘటన మరువకముందే .. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా మారిన పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మెహిదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునేలా కట్టిన ఈ ఫ్లై ఓవర్‌పై ఓ పిల్లర్ పగుళ్లకు గురైంది. పిల్లర్ నంబర్ 20 వద్ద జాయింట్లు కొన్ని పగిలి.. ఫ్లై ఓవర్‌ పై నుంచి వెళ్లే వాహనదారులను, కింది నుంచి వెళ్లే వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఏ క్షణంలో కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇటీవలే ఫ్లై ఓవర్‌పై గుంతలు ఉన్నాయంటూ రిపేర్లు చేపట్టినట్లు సమాచారం.

error: