పెళ్లి చెడగొట్టడానికి సోషల్ మీడియాలో ఖాతా

క్లాస్‌మెట్‌కు పెండ్లి కాబోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్న ఓ యువకుడిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటలోని జేజేనగర్‌కు చెందిన పోతరాజు వినయ్‌కుమార్‌ ప్రస్తుతం విజయవాడలో చదువుతున్నాడు. ఇతడు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అసెంచర్‌ సంస్థకు ఎంపికయ్యాడు. కాగా.. క్లాస్‌మెట్‌ అయిన హైదరాబాద్‌లో నివాసముండే ఓ యువతికి ఇటీవల పెండ్లి నిశ్చయమయ్యింది. దీన్ని జీర్ణియించుకోలేక అతడు.. ఆమె పెండ్లిని చెడగొట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీ క్రియేట్‌ చేసి వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయవాడలో నిందితుడిని సోమవారం అరెస్ట్‌ చేశారు. అలాగే.. ఆర్‌బీఎల్‌ బ్యాంకు కాల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నామని, కార్డు అప్‌గ్రేడ్‌ చేయాలని మోసాలకు పాల్పడుతున్న ముఠాను ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి నేరాలు హైదరాబాద్‌లో కూడా జరగడంతో ఈ ముఠాను పీటీ వారెంట్‌పై అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

error: