పొంచి ఉన్న మిడతల ముప్పు

మిడతల దండయాత్ర ఇటు రైతులు, అటు ఆఫీసర్లలో దడ పుట్టిస్తోంది. నైరుతి రుతుపవనాల టైం కావడంతో గాలివాటం ద్వారా ఒకటి రెండు రోజుల్లో మిడతల దండు సంగారెడ్డి జిల్లాలోకి కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ల మీదుగా ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 25 నుంచి జూలై 5వ లోగా జిల్లాలోని రాష్ట్ర బార్డర్ల ద్వారా దాదాపు 33 గ్రామాల్లోకి మిడతలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు జిల్లా యంత్రాంగం ఇటీవల గుర్తించింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వాటిని అంతమొందించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఈ విషయంపై 22న కలెక్టర్ హనుమంతరావు పోలీసు, అగ్నిమాపక, వ్యవసాయ, ఉద్యాన వన, అటవీ, పంచాయతీ శాఖల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిడతలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. ప్రస్తుతం మిడతలను ఎదుర్కొనేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలను తయారు చేసే పనిలో ఆయా శాఖల ఆఫీసర్లు నిమగ్నమయ్యారు.

error: