ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే

సంవత్సరం అక్టోబర్ 8న దసరా పండుగ జరుపుకోబోతున్నాం. అందుకు 9 రోజుల ముందు నుంచే స్కూళ్లకు సెలవులున్నాయి. ఇక హైదరాబాద్ నుంచీ లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరి ఇప్పుడున్న రైళ్లు సరిపోవు కదా… అందుకే… దక్షిణ మధ్య రైల్వే దసరా సెలవుల్లో తిరిగేలా ప్రత్యేక రైళ్లను నడుపబోతోంది. సికింద్రాబాద్ – కాకినాడ – నర్సాపూర్ – నాగర్‌సోల్ – విల్లుపురం నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. ఇప్పటి నుంచే టికెట్లు బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే… ఆల్రెడీ ఇప్పుడు తిరుగుతున్న రైళ్లకు టికెట్లు ఎప్పుడో బుక్కైపోయాయి. అక్టోబర్ 8, 9, 10, 11 తేదీల్లో కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంది ఆ రైళ్లకు.
Indian Railways… ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ :
* (07003 -07004- 07075) రైళ్లు సికింద్రాబాద్ – కాకినాడ మధ్య వారానికి ఒకసారి వెళ్తాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి, కాకినాడకు వెళ్తాయి. తిరిగి అదే మార్గంలో వెనక్కి వస్తాయి.
* (07434- 07428) రైళ్లు… సికింద్రాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మధ్య నడుస్తాయి.

error: