ప్రముఖ అథ్లెట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి

కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్‌ నికోలస్‌ బెట్‌(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెట్‌ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బెట్‌ ప్రమాద స్థలంలోనే మృతి చెందారని కౌంటీ అధికారులు తెలిపారు.

error: