కోటిపల్లి రాఘవ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1913 డిసెంబర్ 9న జన్మించిన కే.రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. ఆయన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్‌పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలు అందించిన రాఘవ.. 1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాల్రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్, భానుచందర్‌లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.