ప్రజల ఆరోగ్య పరిస్థితి ఫార్మారంగం చేతుల్లోనే ఉందని,వైద్యరంగంలో పరిశోధన,అభివృద్ధిలో ఫార్మాస్యూటికల్ కీలకపాత్ర పోషిస్తున్నది అని గవర్నర్ ESL నరసింహన్ అన్నారు.బుధవారం బాలానగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో 7 వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ,MS , MBA ,PHD వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చి మానవవనరులను నైపర్ అభివృద్ధి చేస్తున్నదని కొనియాడారు.నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రాకింగ్ ఫ్రేంవర్క్-2018 లో నైపర్ ఆరో స్థానంలో నిలిచిందని చెప్పారు.ఉత్తీర్ణులైన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,విద్యార్థులే పరిశోధన చేసి వినూత్న విషయాలను కనుగొనాలని సూచించారు.