బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఏటా ఆషాఢ మాసంలో వైభవంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం భక్తుల సందడి లేకుండానే సాదాసీదాగా జరిగింది. కరోనా నేపథ్యంలో ఆలయ అర్చకులు, అధికారులు మాత్రమే వేడుకలో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు, పుస్తె మెట్టెలు, తలంబ్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్ ​ఇంటి నుంచి పంపించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు మూడు రోజుల పాటు సాగుతుంటాయి. సిటీ నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఆ సంబరం అంబరాన్నంటుతుంది. ఈసారి భక్తులను అనుమతించకపోవడంతో గుడి ప్రాంగణం బోసిపోయింది. చాలామంది బయటికి నుంచే అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్లారు.

error: