బాదం పూరి

కావలసినవి:
మైదా పిండి-1 కప్పు
బాదం-పావు కప్పు
నెయ్యి-4 టేబుల్ స్పూన్లు
బియ్యపిండి -అర కప్పు
నూనె-వేయించుకోవడానికి సరిపడా
ఉప్పు-తగినంత
ఏలకుల పొడి-అర టీ స్పూన్
నీళ్లు-1 కప్పు
పంచదార-రెండు కప్పులు
కుంకుమ పువ్వు-కొద్దిగా
లవంగాలు-పూరీలా సంఖ్యను బట్టి
తయారీ విధానం:ఎనిమిది గంటల పాటు భాదములను నాన బెట్టి బాదం పప్పులను మిక్సీలో వేసుకుని పేస్ట్ ల చేసుకొని పక్కన బెట్టుకోవాలి.అనంతరం ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి,బాదం పేస్ట్,బియ్యప్పిండి,నెయ్యి,ఉప్పువేసుకుని బాగా కలుపుతూ ముద్దలా చేసుకోవాలి.ఈ సమయంలోనే పక్కన స్టవ్ వెలిగించి పంచదార,నీళ్లు వేసుకుని పాకం దగ్గర పడేముందు ఏలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు బాదాం మైదా మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు లో ఉండలుగా చేసుకుని వాటిని పూరీలుగా తాయారు చేసుకోవాలి.వాటిని రెండు సార్లు మడిచి చపాతీ కర్రతో నొక్కాలి.ఇప్పుడు లవంగాలను ఒక్కోపూరికి ఒక్కొక్కటి పెట్టి అనంతరం వాటిని నూనెలో వేసి పాకం లో వేసుకుంటే సరిపోతుంది.

error: