ఎంజాయ్ చేసేందుకు చోరీలు చేస్తున్న బావ బావమరిదిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద పదిన్నర తులాల బంగారం, 39 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షితమూర్తి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. మల్లాపూర్‌లో ఉండే జంగలం చందన్ అలియాస్ రమేష్ ( 36 ), సిరిగిరి శంకరయ్య అలియాస్ శంకర్ ( 26 ) బావ బావమరుదులు. గతంలో చందన్ చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శాలరీ సరిపోకపోవడంతో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్వేశాడు. తన బావమరిది శంకర్‌తో కలిసి తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేస్తున్నారు. మేడిపల్లి హనుమాన్ కమాన్ వద్ద పోలీసులు చెకింగ్చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని కేసులు ఫైల్ చేశారు. మేడిపల్లి పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.