బ్రాహ్మణులకు అండగా ఉంటాం -KTR

దేశంలోనే ప్రప్రథమంగా అర్చకులకు ట్రెజరీ నుంచి జీతాలిస్తున్న ఘనత తెలంగాణ కె దక్కిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి KTR అన్నారు.సీఎం KCR పాలనలో రాష్ట్రంలో పేదల సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని,పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.హైదరాబాద్ లోని వండర్ పార్కులో నిర్వహించిన బ్రాహ్మణా ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి KTR మాట్లాడుతూ,సీఎం KCR కులం,మతం తో నిమిత్తం లేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని,రాష్ట్ర బడ్జెట్లో 43 శాతం నిధులను వీటికి వెచ్చిస్తున్నామని చెప్పారు.పేదరికానికి కులం లేదు,ఏ కులం లో పుడతాం.ఎక్కడ పుడతామన్నది మన చేతుల్లో లేదు.కులానికి,పేదరికానికి లింక్ కూడా లేదు.అగ్రవర్ణాలుగా చెప్పుకునే చాలా కులాల్లో పెదాలున్నారు అని మంత్రి పేర్కొన్నారు.దూప,దీప నైవేద్య పథకం కూడా అమలుచేస్తున్నామని,మరో 1200 ఆలయాలకు వర్తింప చేయాలనీ నిర్ణయించిన ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాలేదని చెప్పారు.సీఎం KCR చొరవతో 2,069 దేవాలయాల జీర్ణోద్ధరణ కోసం దాదాపు రూ.252 కోట్లు విడుదల చేసారని వివరించారు.

error: