మట్టి వినాయక ప్రతిమల పంపిణీ..
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ లోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ బోయిన్పల్లి గారు..
పర్యావరణాన్ని కాపాడుతూ, దైవభక్తితో ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని కోరుతూ.. రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు , ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Tags MATTIVINAYAKA VINAYAKACHATHURTHI