మరో మూడు రోజుల్లో ఈ సర్వీసులన్నీ బంద్

నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడుపుతున్న ఓలా, ఉబర్‌, ర్యాపిడో సంస్థలు మూడు రోజుల్లోగా ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కారు ఆదేశించింది. ఎందుకు నిలిపివేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సంస్థలు 2 కిలోమీటర్ల దూరానికి కూడా ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారన్న ప్రయాణికులు ఫిర్యాదు మేరకు అక్కడి సర్కారు ఈ నిర్ణయం తీసుకొన్నది. నిబంధనల ప్రకారం.. మొదటి రెండు కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత కిలోమీటర్‌కు రూ.15 చొప్పున వసూలు చేయాలి. కానీ, సదరు సంస్థలు మాత్రం రూ. 100కి పైగా వసూలు చేస్తున్నాయి.

అటు.. ఓలా, ఉబర్‌, ర్యాపిడో సంస్థలకు ఇచ్చిన లైసెన్స్‌ కేవలం కార్లను క్యాబ్‌‎లుగా నడపటానికేనని, ఆటోలకు లేదని ఆ రాష్ట్ర రవాణాశాఖ తేల్చి చెప్పింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆ సంస్థలను హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఈ సంస్థలకు పోటీగా బెంగళూరు స్థానిక ఆటో డ్రైవర్లు సొంతంగా ‘నమ్మ యాత్రి’ పేరుతో కొత్త యాప్‌ను అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. దీన్ని నవంబర్‌ 1న ప్రారంభించే అవకాశాలున్నాయి.

error: