మసాలా దొండ కయ కర్రీ

కావలసిన పదార్థాలు:

దొండకాయలు – 35,
టమోటాలు – 2,
కరివేపాకు – 3 రెబ్బలు,
బ్రౌన్‌ షుగర్‌ – 1 టేబుల్‌ స్పూను,
(వేగించిన) వేరుశనగపప్పు పొడి – అరకప్పు,
నూనె – 1 టేబుల్‌ స్పూను,
కారం – 1 టీ స్పూను,
ఆమ్‌చూర్‌ పొడి – 1 టీ స్పూను,
నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు,
గసగసాలు – 1 టేబుల్‌ స్పూను,
దనియాలు – 1 టేబుల్‌ స్పూను,
మెంతులు – 1 టీ స్పూను,
జీలకర్ర – 1 టీ స్పూను,
లవంగాలు – 2.
కొత్తిమీర  – అరకప్పు,

తయారుచేసే విధానం:

దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోసుకోవాలి. నువ్వులు, గసగసాలు కలిపి వేగించి పొడిచేయాలి మిగతా మసాల దినుసులను కూడా చిన్నగా మంట మీద వేగించి పొడిచేయాలి. దొండకాయ ముక్కల్ని నూనెలో దోరగా వేగించాలి. కడాయిలో 1 టేబుల్‌స్పూను నూనె వేసి కరివేపాకు, టమోటాలు వేగాక కారం, మసాలపొడి దొండముక్కలు కలపాలి. నువ్వులు, గసగసాలపొడి, బ్రౌన్‌షుగర్‌, ఆమ్‌చూర్‌పొడి వేసి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరు, ఉప్పు కలిపి కలతో త్రిప్పి మూతపెట్టాలి. 5 నిమిషాల తర్వాత వేరుశనగపొడి, మరో పావు కప్పు నీరు, కొత్తిమీర చల్లి నీరు ఆవిరయ్యేవరకు ఉంచి దించేయాలి.అంతే మసాలా దొండ కయ కర్రీ రెడీ.

error: