మా అధ్యక్షుడిగా ‘నరేశ్‌’ విజయం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో నరేశ్‌ విజయం సాధించారు. ఉత్కంఠ బరితంగా ఎన్నికలు జరిగాయి. గతంలో మా అధ్యక్షుడిగా చేసిన శివాజీ రాజా.. ఈ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. నరేశ్‌ కు 268 ఓట్లు పోలవ్వగా.. శివాజీ రాజాకు 199 ఓట్లు వచ్చాయి. దీంతో 69 ఓట్ల మెజార్టీతో నరేశ్‌ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.

error: