తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భాగమైన నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది.నేతలందరూ వారు పోటీ చేసే స్థానాలలో నామినేషన్ వేశారు.ఇక నియోజక వర్గాల్లో అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు.విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.మంగళవారం నామినేషన్లను పరిశీలించనుండగా,ఉపసంహరణకు ఈ నెల 22 చివరి తేదీ.
