గతేడాది ఫిబ్రవరిలో అమెరికాలోని కన్సస్‌లో తెలుగు వ్యక్తి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాతి విద్వేష కారణంతో కాల్చి చంపిన కేసులో అమెరికా నౌకాదళ మాజీ సభ్యుడు ఆడం పురింటన్‌కు కోర్టు మూడు జీవిత కాలాల జైలు శిక్షను విధించింది. కన్సస్‌లోని ఓ బార్‌లో శ్రీనివాస్, ఆయన స్నేహితుడు మాడసాని అలోక్ కూర్చొని ఉండగా పురింటన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అలోక్‌తోపాటు, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికా జాతీయుడికి గాయాలయ్యాయి.
