తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బహుజన లెఫ్ట్ పార్టీ(BLF )విడుదల చేసింది.29 మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో,ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనీ నిర్ణయించుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు కు టికెట్ ఇచ్చింది.అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించమని,ప్రజల మద్దతు తమకే ఉంటుందని BLF చైర్మన్ నల్లా సూర్యప్రకాష్,కన్వీనర్ తమ్మినేని వీరబద్రం ఆశాభావం వ్యక్తం చేశారు.
