పేటీఎం మనీ పేరుతో యాప్‌ను మంగళవారం విడుదల చేసింది. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో 2.5 కోట్ల మందికి మ్యూచువల్ ఫండ్స్ ప్రాడక్ట్ లను అమ్మాలన్న టార్గెట్ తో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్‌లో 5 కోట్ల మంది ఇన్వెస్ట్ చేయనున్నారు.2 నుంచి 2.5 కోట్ల మంది తమ లక్షమన్నారు పేటీఎం మనీ హోల్‌టైమ్ డైరెక్టర్ ప్రవీణ్ జాదవ్.
రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడి పెట్టుకునేందుకు పేటీఎం మనీ అవకాశం కల్పిస్తోంది. 8,50,000 మంది యూజర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల కోసం తమ ప్లాట్‌ఫామ్‌పై పేర్లను నమోదు చేసుకున్నారని, వీరిలో 65 శాతం మంది టాప్–15 పట్టణాలకు బయటే ఉన్నారు.