రేపటి నుండి తెలంగాణలో లాక్డౌన్

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.
రేపటి నుంచి పది రోజుల పాటు తెలంగాణలో లాక్‍డౌన్ అమల్లో ఉంటుంది. 22తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు నిత్యవసరాలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోగా.. రేపటి నుంచి కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించి నిబంధనలు అమల్లోకి తీసుకుని రానున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.
టీకా కోసం వెళ్లేవారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తుంది ప్రభుత్వం. అత్యవసర సేవలు, మెడికల్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది.

error: