అదనపు వనరుల సమీకర ణపై రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 11 న సమావేశం కానున్నది. గురువారం మ ధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ స మావేశంలో అదనపు వనరుల సమీకర ణతోపాటు పలు అంశాలపై చర్చించను న్నారు. నేతన్నకు బీమా, 57 ఏండ్లకు అసరా పింఛన్లు, డయాలసిస్ పేషంట్లకు ఆసరా పింఛన్లు, అనాథ పిల్లల పాలసీ, వజోత్సవాల సందర్భంగా అసెంబ్లీ ప్ర త్యేక సమావేశ నిర్వహణ.. తదితర అం శాలపై చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది.