తెలంగాణాలో రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బంధు,రైతు బీమా,మిషన్ కాకతీయ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన,వ్యవసాయ,గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఏడేళ్లు ముందుగానే IPS సర్వీస్ కి రాజీనామా చేసానని తెలిపారు.