రైతు బంధు,రైతు భీమా పథకాలకు ఖ్యాతి

రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు,రైతు భీమా పథకాలు విశేష ఖ్యాతిని పొందుతున్నాయి.ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి మనల్ని అందుకుని ఈ పథకాలకు తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా విశిష్ట గుర్తింపునిచ్చినా విషయం విధితమే.దీంతో ఈ రెదను పథకాలు రాష్ట్ర శాసన సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.రైతు బంధు,రైతు భీమా పథకాల లబ్ధిదారులు తెరాస కు స్టార్ క్యాంపెయినర్లుగా మారడమే ఇందుకు కారణం.ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకం ద్వారా ఏటా ఎకరానికి రూ.8000 వేల చొప్పున పంట పెట్టుబడి అందచేస్తున్న తెరాస ప్రభుత్వానికి అన్నదాతలు సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నారు.వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు,ఎరువుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న ఈ పెట్టుబడి సాయం తమకు ఎంతో అక్కరకు వస్తుందని రైతులు సంతోషిస్తున్నారు.అందుకే వాళ్లంతా ఎన్నికల్లో మరోసారి తెరాస కు మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారు.అలాగే రైతు భీమా పథకం ద్వారా అనేక మంది లబ్ది పొందుతున్నారు.దురదృష్టవ శాత్తు ఏ కారణం తో అయినా అన్నదాత చనిపోతే ఆయన కుటుంబానికి రైతు భీమా పథకం ద్వారా రూ.5లక్షల పరిహారాన్ని చెల్లిస్తుండడం హర్షనీయం అని ,అందుకే తెరాస కు మరి అండగా నిలుస్తామని రైతులు పేర్కొన్నారు.

error: