రోడ్రిగో వివాదాస్పద వ్యాఖ్యలు

ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో దుతర్తే తాజాగా మరోసారి మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రోడ్రిగో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.అందమైన యువతులు, మహిళలు ఉన్నంతవరకూ అత్యాచారాలు జరుగుతునే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్రిగో సొంత నగరమైన డవావోలో ఇటీవలి కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనే నివేదికపై ఆయన ఇలా స్పందించారు.

అందమైన యువతులు, మహిళలు ఎఉన్నంతవరకూ అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ‘పురుషుడు కోరగానే ఏ మహిళ అయినా సెక్స్ కు ఒప్పకుంటుందా? ఒప్పుకోదు. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి’ అని రోడ్రిగో చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై అక్కడి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

error: