లార్డ్స్‌లో విరాట్ కి అండర్సన్ సవాల్

తొలి టెస్టులో వీరోచిత బ్యాటింగ్‌తో చెలరేగిన టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోసం ఇంగ్లండ్ కొత్త అస్ర్తాలు తయారు చేస్తున్నది. బర్మింగ్‌హామ్‌లో తన బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన విరాట్‌ను లార్డ్స్‌లో కచ్చితంగా ఔట్ చేస్తానని పేసర్ అండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇందుకోసం కొత్త తరహా ఎత్తుగడలు అవలంభిస్తున్నట్లు చెప్పాడు.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేస్తే అందులో అండర్సన్ బౌలింగ్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే రాబట్టాడు. మరోవైపు క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్‌లో విజయం సాధించాలని ప్రతి కెప్టెన్ కలగంటాడు. ఇప్పుడు విరాట్ కూడా దీనిపైనే దృష్టిపెట్టాడు.

error: