వాట్సాప్ గుడ్ న్యూస్ …

వాట్సాప్ యూజర్లకు నిజంగా గుడ్ న్యూస్.. అందులోనూ గ్రూపు చాట్, వ్యక్తిగత చాట్ యూజర్లంతా హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చు. ఎందుకంటే.. ఇకపై గ్రూపు చాట్, వ్యక్తిగత చాట్‌లో నోటిఫికేషన్లు మూగ బోనున్నాయి. ఇప్పటివరకూ వాట్సాప్ చాట్ బాక్సు‌లో నోటిఫికేషన్లను మ్యూట్ చేయడానికి లిమిట్ పిరియడ్ మాత్రమే ఉండేది. ఇకపై అలా కాదు.. ఎప్పటికీ మ్యూట్ లో పెట్టుకోవచ్చు.
సాధారణంగా చాలామంది వాట్సాప్ గ్రూపు లేదా వ్యక్తిగత చాట్ నోటిఫికేషన్లతో విసిగిపోతుంటారు. నిద్ర పోతున్న సమయంలోనూ ఎవరైనా ఏదైనా పంపగానే టింగ్ టింగ్ మంటూ నోటిఫికేషన్లు వస్తుంటాయి. దాంతో యూజర్లు చిరాకుపడుతుంటారు. వెంటనే నోటిఫికేషన్లను మ్యూట్ చేసేస్తుంటారు. అయితే ఇందులో మ్యూట్ సెట్ చేయాలంటే గ్రూపును శాశ్వతంగా మ్యూట్ చేయనివ్వదు.

error: