వృత్తివిద్యే తారకమంత్రం

జర్నలిజం విద్యార్థులకు అంతగా ప్రాక్టికల్ అవగాహన ఉండటం లేదని పీఆర్‌పై నిర్వహించిన యూజీసీ జాతీయ సదస్సు వెల్లడించింది. పరిశ్రమ కూడా తగినంత పాత్ర పోషించేలా అనువైన సిలబస్‌ను రూపొందించాలి. అప్పుడే పరిశ్రమ అంచనాలకు దీటుగా విద్యార్థులు ఎదుగటానికి వీలవుతుంది.

ప్రజాస్వామిక, లౌకిక వ్యవస్థలో క్రియాశీల భాగస్వాములుగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో మీడియాకు అపారశక్తి ఉన్న ది. మీడియావిద్యకు మరిన్ని పెట్టుబడు లు సమకూరిస్తే, విశ్వవిద్యాలయాలు ప్రతిభగల వృత్తినిపుణులను తయారుచే యగలుగుతాయి. ఈ ఏడాది జూలైలో జైపూర్‌లో జరిగిన మూడవ అఖిల భారత మీడియా విద్యావేత్తల సమావేశం ఈ విషయాన్ని నొక్కిచెప్పింది. రెండు ప్రధాన వృత్తులైన జర్నలిజం,ప్రజాసంబంధాలకు మీడియా విదానం తప్పనిసరి. దేశంలో జర్నలిజం విద్యకు 80 ఏండ్ల చరిత్ర ఉన్నది. ప్రజాసంబంధా ల విద్యారంగం మాత్రం ఇంకా శైశవదశలోనే ఉన్నది.

ఈ క్రమంలో భారత్‌లో ప్రజా సంబంధాల రంగం పరిస్థి తి ఎలా ఉందన్న ప్రశ్న తలెత్తకమానదు. ప్రపంచంలో ఎవరి కీ తీసిపోని అత్యున్నత అర్హత గల పీఆర్ నిపుణులు మనకు న్నారు. అదే సమయంలో వృత్తి నైపుణ్యం ఏమీలేని వారు కూడా ఈ రంగంలో చాలామంది కొనసాగుతున్నారు. మన దేశంలో ప్రజా సంబంధాల రంగం ఎదుర్కొంటున్న విచిత్ర, విషాదకర పరిస్థితి ఇది. యాడ్ ఫ్యాక్టర్స్ (Ad Factor) సం స్థ సీఈఓ మదన్ బహల్ విశాఖపట్నంలో జరిగిన అఖిల భార త ప్రజా సంబంధాల సమావేశంలో మాట్లాడుతూ.. 90 శాతం మంది పీఆర్ సిబ్బంది ఒక్క పీఆర్ పుస్తకం కూడా చదువలేదని తన సర్వేలో వెల్లడైందని చెప్పారు. పీఆర్ కన్సల్టెంట్ రిచాసేథ్ జరిపిన ట్విటర్ సర్వేలో యాభై శాతం మంది పీఆర్ నిపుణులు, పీఆర్ కాకుండా వేరే వృత్తిని ఎంచుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడైంది. అర్హులైన పీఆర్ నిపుణుల అవసరం పెరుగుతూ వస్తున్నా డిమాండ్‌కు తగ్గట్లుగా పీఆర్ నిపుణులు తయారుకావడం లేదు. ఈ అంతరం అనేది ఈ రం గం ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు. ప్రజాసంబంధాల నిపుణుల వాసికంటే రాశిలో మిన్నగా ఉండటం ఈ రం గంలో కొట్టవచ్చినట్లు కన్పించే లోపం.

ప్రజా సంబంధాలు ప్రత్యేక నైపుణ్యంతో కూడిన శాస్త్రమని అమెరికా, బ్రిటన్‌ల అనుభవం రుజువు చేస్తున్నది. ఈ రంగంలోకి ప్రవేశించేవారు ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలి. అమెరికా, బ్రిటన్‌లలో బీఏ(ఆనర్స్), పీఆర్, ఎంఎస్ (పీఆర్), ఎంఏ (పీఆర్), పీహెచ్‌డీ వంటి ప్రత్యేక కోర్సులున్నాయి.మనదేశంలో పీఆర్ విద్యకు సంబంధించి చూస్తే, దేశంలో ఏ సంప్రదాయ యూనివర్సిటీ పీఆర్ కోర్సును నిర్వహించ డం లేదు. వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం విభాగాలు పీఆర్ స్థాయిలో ఎనిమిది పాఠ్యాంశాల్లో ఒకటిగా ప్రజాసంబంధాలను బోధిస్తున్నాయి. ఈ తరహా విద్యతో సమర్థవంతుడైన పీఆర్ వృత్తినిపుణుడు రూపొందలేడు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దేశంలోని పీఆర్ విద్యలో మార్గదర్శిగా నిలిచింది. పీజీ డిప్లొ మా, బ్యాచిలర్ ఆఫ్ పీఆర్, ఎంఏ మాస్ కమ్యూనికేషన్ పీఆ ర్ కోర్సులను ఈ విశ్వవిద్యాలయం నిర్వహించింది. పీజీ స్థాయి పీఆర్ కోర్సుకు గుర్తింపు కోరుతూ యూజీసీకి అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రతిపాదన సమర్పిస్తే తాము ఆమోదించిన జాబితాలో ఈ కోర్సు లేదంటూ యూజీసీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అంటే ప్రజా సంబంధాలను విద్యాపరమైన శాస్త్రంగా యూజీసీ గుర్తించడంలేదని అర్థమవుతున్నది.

జర్నలిజం కోర్సులో భాగంగా అందిస్తున్న పీఆర్ సబ్జెక్ట్ విస్తృతమైన ప్రత్యేకవృత్తిగా అభివృద్ధి చెందిందని జర్నలిజా న్ని, పీఆర్‌ను ఒకేగాటన కట్టి చూడలేమ ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల పూర్వ డీన్ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ పి. ఎల్.విశ్వేశ్వర్‌రావు అభిప్రాయం అక్షరసత్యం. పాశ్చాత్య దేశాల్లో మాదిరే మన దేశంలో కూడా ప్రజాసంబంధాలను స్వతంత్ర ఎకడమిక్ స్రవంతిగా గుర్తించి ప్రత్యేక కోర్సును ప్రారంభించాలి. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అఫ్జల్ మహమద్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
పీఆర్ విద్యకు పంచసూత్ర ప్రణాళిక అవసరం. భారతీయ పీఆర్ విద్యను మరింత సమగ్రం, సంపూర్ణం చేయటానికి, పంచసూత్ర ప్రణాళికను పరిగణనలోకి తీసుకొని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం, యూజీసీ, పీఆర్ వృత్తిసంస్థలపై ఉన్నది.
1.యూజీసీ మార్గసూచీ: యూజీసీ కనుక చొరవ తీసుకోకుంటే, ఉన్నత విద్యారంగం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ప్రజాసంబంధాల వృత్తివిద్యకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సహేతుకంగా మదింపుచేసి నమూనా పీఆర్ కోర్సులతో మార్గసూచీ రూపొందించటానికి పబ్లిక్‌రిలేషన్స్ స్టడీస్‌పై నిపుణుల కమిటీని నియమించాలి.

2.కమ్యూనికేషన్ నిపుణులందరికీ శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) తరహాలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మాస్ కమ్యూనికేషన్స్ పీఆర్ అకాడమీని నెలకొల్పాలి.
3. పీఆర్ పాఠ్య పుస్తకాలు భారతీయ పరిస్థితులకు సరితూగే అంతర్జాతీయ ప్రమాణం కలిగిన పాఠ్యపుస్తకాల కొరత ఉన్నది. పాఠ్య పుస్తకాల కోసం పాశ్చాత్య దేశాలవైపు చూడా ల్సి రావడం విచారకరం. ప్రజాసంబంధాలపై భారతీయ పాఠ్యపుస్తకాలను యూజీసీ, రాష్ర్టాల ఉన్నత విద్యా మండళ్లు, విశ్వవిద్యాలయాలు స్పాన్సర్ చేయాలి.

4.పీఆర్ కార్యక్రమాల పరిశోధన, మదింపు లేకపోవడం ఈ వృత్తి ఆచరణలో మరో ప్రధానలోపం.ఈ దృష్ట్యా పాఠ్యాంశంలో భాగంగా పరిశోధనను జోడిస్తే పీఆర్ నిపుణులు తమ కార్యక్రమ ఫలితాలను శాస్త్రీయంగా మదింపు చేసుకోగలుగుతారు.
5.యూనివర్సిటీ పరిశ్రమ అనుసంధానం కావాల్సిన అవ సరం ఉన్నది. జర్నలిజం విద్యార్థులకు అంతగా ప్రాక్టికల్ అవగాహన ఉండటం లేదని పీఆర్‌పై నిర్వహించిన యూజీసీ జాతీయ సదస్సు వెల్లడించింది. పరిశ్రమ కూడా తగినంత పాత్ర పోషించేలా అనువైన సిలబస్‌ను రూపొందించాలి. అప్పుడే పరిశ్రమ అంచనాలకు దీటుగా విద్యార్థులు ఎదుగటానికి వీలవుతుంది.ప్రజాస్వామిక, వర్థమాన భారత్‌లో స్వేచ్ఛా సమాచార ప్రవాహానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. అందుచేత భారతదేశం ప్రజాసంబంధాల వృత్తికి ఉజ్వల భవిష్యత్తును కల్పించడమే గాక, భారతీయ పీఆర్ ఆసియా సిం హంలా ఎదుగటానికి దోహదపడగలదని ఆశిద్దాం.
(వ్యాసకర్త: పూర్వ సంచాలకులు, సమాచార, ప్రజా సంబంధాల శాఖ)
(రేపు జాతీయ ప్రజా సంబంధాల విద్యా దినోత్సవం..)

error: