వృద్ధిరేటులో నెంబర్‌ వన్‌ తెలంగాణ

దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే రాష్ట్రం సగటున ఏటా 17.2 శాతం వృద్ధిరేటులో పురోగమిస్తున్నది. సొంత ఆదాయ వనరులతోనే దీనిని సాధించడం విశేషం. ఆర్థిక వృద్ధిలో నాలుగేండ్లుగా దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

2014-15 నుంచి 2017-18 వరకు పరిశీలిస్తే.. రాష్ట్ర సొంత ఆదాయ వనరులతోనే తెలంగాణ ఈ ప్రగతిని సాధిస్తూ వస్తున్నది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ.. హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్, గుజరాత్ లాంటి రాష్ర్టాలతో పోటీపడి మరీ వృద్ధిరేటులో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

కాగ్  వెబ్ సైట్లో పొందుపర్చిన గణాంకాల ప్రాకారం 2014-15లో రాష్ట్ర సొంత రెవెన్యూ 35 వేల 146 కోట్లు కాగా.. 2017-18లో 56 వేల 520 కోట్లకు చేరుకున్నది. దీని ప్రకారం ఏడాది సగటు గ్రోత్  రేట్ 17.2 శాతంగా ఉంది.

error: